నేడు జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నేడు(బుధవారం) కర్నూలుతో పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టనున్న నిరసనలు, ర్యాలీలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి. కర్నూలు నగరంలో ఎస్‌టీబీసీ కళాశాల నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ఆర్‌ఎస్ రోడ్డు, జిల్లా పరిషత్ కార్యాలయంలోని అర్బన్ తహసీల్దారు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తాం. ర్యాలీలో ప్రజలతో పాటు వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు హాజరై విజయవంతం చేయాలి.
– ఎస్వీ మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు


