ఏకగ్రీవంగా సహకార ఎన్నికలు
కర్నూలు (అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ అమరావతి జిల్లా శాఖ ఎన్నికలు మంగళవారం ఏకగ్రీవంగా జరిగాయి. కర్నూలు కృష్ణానగర్‌లోని సహకార శాఖ డివిజనల్ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల అధికారిగా కె.శ్రీనివాసులు వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా కర్నూలు సబ్ డివిజన్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ టి.నాగరమణయ్య ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎం.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా ఎం.రామరాజు, సెక్రటరీగా పత్తికొండ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పి.లక్ష్మీకాంత రెడ్డి, జాయింట్ సెక్రటరీగా షేక్ మున్వర్ బాషా, జాయింట్ సెక్రటరీ (ఉమన్) పి. తిరుమల, కోశాధికారిగా శ్రీ నివాస్, క్యాడర్ సెక్రట రీగా పుష్పలత, ఖలీలుల్లా షరీఫ్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యుల చేత ఎన్నికల అధికారి కె.శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులను సహకార శాఖ ఉద్యోగులు అభినందించారు. తమపై నమ్మకముంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
లక్ష్మీకాంత రెడ్డి
జిల్లా సెక్రటరీ
నాగరమణయ్య
జిల్లా అధ్యక్షుడు
ఏకగ్రీవంగా సహకార ఎన్నికలు


