జిల్లాలో హై అలర్ట్
కర్నూలు: ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా అంతటా పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు, పోలీసు జాగిలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో జిల్లాలో జనం రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు, దేవాలయాలు, మసీదులు, జాతీయ రహదారులు, టోల్ గేట్లు, రాష్ట్ర రహదారులు, పట్టణాల్లోని లాడ్జీలు, వ్యాపార సముదాయాలతో పాటు వాహన తనిఖీలు విస్తృతంగా నిర్వహించారు. అనుమానితుల కదలికలు, లగేజీపై ప్రత్యేక నిఘా ఉంచారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 112 లేదా 100కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.


