అలుపెరుగని పోరు
చంద్రబాబు సర్కార్ 17 నెలల వ్యవధిలో ప్రజలకు, రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు వైఎస్సార్‌సీపీ ఎప్పటికప్పుడు ఆందోళనలు చేపడుతోంది. పొగాకు, మిర్చి, టమాట, ఉల్లి రైతులకు మద్దతుగా అనేక పోరాటాలు చేసింది. ప్రభుత్వ మొండి వైఖరి, నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ధర్నా లు, మీడియా సమావేశాలు నిర్వహించి ఒత్తిడి తీసుకొస్తోంది. అన్నదాత పోరు, యువత పోరు, విద్యుత్‌చార్జీల పెంపుపై భారీ ర్యాలీలు నిర్వహించి ప్రజలకు మ ద్దతుగా నిలిచింది. ప్రజా స్పందన చూసి వైఎస్సార్ సీపీ కార్యక్రమాలపై పోలీసు శాఖ అడ్డుకునే ప్రయ త్నం చేస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుని ఇంటికి 30 పోలీ సు యాక్ట్ ఉందంటూ నోటీసులు అంటించడం చూస్తే ఏస్థాయిలో అవాంతరాలు సృష్టిస్తున్నారో తెలుస్తోంది


