రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి
కోసిగి: మండల పరిధిలోని మూగలదొడ్డి గ్రామాని కి చెందిన బోయ వెంకట రెడ్డి(25) తిరుపతిలో రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామంలో పనులు లేకపోవడంతో మూడేళ్లుగా తిరుపతికి వలస వెళ్లి అక్కడ జీవనం సాగిస్తూ అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చిపోచేవాడు. మొహర్రం అనంతరం మూడు నెలల క్రితం భార్య పిల్లలతో కలిసి వెంకట రెడ్డి తిరుపతికి వెళ్లాడు. సోమవారం సాయంత్రం పనులు ముగించుకుని బైక్‌పై తిరుపతిలో సరుకులు కొనుగోలు చేసేందుకు బయలదేరాడు. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొనడంతో తలకు తీవ్రమై గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని స్వగ్రామం మూగలదొడ్డికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య మహేశమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.


