వృద్ధురాలిని కాపాడిన యువకులు
బండి ఆత్మకూరు: కుందూ నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన లింగాపురం గ్రామానికి చెందిన అంబటి ఈశ్వరమ్మను మంగళవారం నలుగురు యువకులు కాపాడారు. ఎస్‌ఐ జగన్మోహన్ తెలిపిన వివరాలు.. లింగాపురం గ్రామానికి చెందిన అంబటి ఈశ్వరమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది బండి ఆత్మకూరు సమీపంలోని కుందూనదిలో దూకింది. స్థానిక యువకులు ఫిదా, సూరజ్, శీను, అఫ్రోజ్ గమనించి ఈశ్వరమ్మను కాపాడారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వృద్ధురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
ఏపీ ఎన్‌జీజీఓస్ సభ్యత్వ నమోదు
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీ ఎన్‌జీజీఓస్ అసోసియేషన్ పటిష్టతకు మరింత జవాబుదారితనంతో పనిచేయాల్సిన అవసరముందని జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి జవహార్‌లాల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. పలువురు ఉద్యోగులకు సభ్యత్వం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సాంబశివారెడ్డి, రమణ, భాస్కరనాయుడు, వెటర్నరీ పారా సిబ్బంది సంఘాల సమాఖ్య చైర్మన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వృద్ధురాలిని కాపాడిన యువకులు


