టీబీ డ్యాం నీటిపై 14న ఐఏబీ సమావేశం
హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీ ఇతర కాలువలకు నీటి విడుదల, నిలిపివేత తదితర అంశాలపై ఈనెల 14న బెంగళూరు విధానసౌధలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు ఇరిగేషన్ ఉన్నతాధికారులు, నీటి సలహా మండలి సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో 125వ నీటి సలహా మండలి(ఐఏబీ) సమావేశం నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు మంగళవారం తెలిపారు. గతేడాది డ్యాం 19వ క్రస్టుగేటు వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడంతో ఏర్పాటు చేసిన స్టాప్‌లాక్ గేటు స్థానంలో కొత్త గేటుతోపాటు మిగిలిన 32 క్రస్టుగేట్ల స్థానంలో కొత్తవి బిగించేందుకు పనులు ప్రారంభించనున్నారు. అందులోభాగంగా ఒక పంటకు(ఖరీఫ్) మాత్రమే నీరిచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాగా కర్ణాటక, ఏపీలోని తుంగభద్ర రైతు సంఘం నాయకులు, రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంతోపాటు ఇతర సమస్యలను సమావేశంలో చర్చించనున్నారు.
టీబీ డ్యాం


