విద్య, పరిశోధనల్లో పరస్పర సహకారం | - | Sakshi
Sakshi News home page

విద్య, పరిశోధనల్లో పరస్పర సహకారం

Nov 11 2025 5:53 AM | Updated on Nov 11 2025 5:53 AM

విద్య, పరిశోధనల్లో పరస్పర సహకారం

విద్య, పరిశోధనల్లో పరస్పర సహకారం

ట్రిపుల్‌ఐటీ, ఆర్‌యూ మధ్య ఒప్పందం

కర్నూలు సిటీ: విద్య, పరిశోధన అంశాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మ్యానుఫాక్చరింగ్‌ (ట్రిపుల్‌ ఐటీ), రాయలసీమ యూనివర్సిటీలు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు సోమవారం జగన్నాథగట్టులో ఉన్న ట్రిపుల్‌ ఐటీడీఎంలో ఆ సంస్థఽ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి, ఆర్‌యూ వీసీ ఆచార్య వెంకట బసవరావు సంతకాలు చేసి పత్రాలను మార్చుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్య, పరిశోధన, ఆవిష్కరణ, సాంకేతిక అభివృద్ధిలో పరస్పర సహకారం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పాఠ్యంశాల రూపకల్పన, ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు, నిర్వహణ, సమావేశాలు, ఆధునాతన ప్రయోగశాలలు, ఆవిష్కరణ, కేంద్రాల స్థాపనలో పరస్పర మద్దతుకు ఈ ఒప్పందం దోహద పడుతుందన్నారు. ఈ భాగస్వామ్యం కింద రెండు సంస్థలు సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా సైన్స్‌, బ్లాక్చెయిన్‌, క్వాంటం, పోస్ట్‌ క్వాంటం ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ టెక్నాలజీ, ఇతర అభివృద్ధి చెందుతున్న డోమైన్ల వంటి అత్యాధునిక రంగాల్లో ఉమ్మడి చొరవలకు అవకాశాలను అన్వేషిస్తుందన్నారు. ఈ అవగాహన ఒప్పందం రెండు సంవత్సరాల కాలం పాటు చెల్లుబాటు అవుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌యూ రిజిస్ట్రార్‌ విజయ్‌కుమార్‌, ట్రిపుల్‌ఐటీ డీఎం రిజిస్ట్రార్‌ రాజ్‌ కుమార్‌, అచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement