● ప్రతి రోజు వేకువనే చన్నీటితో స్నానం చేయాలి.
● నలుపు లేదా నీలి రంగు దుస్తులు ధరించాలి. కన్నె స్వాములు (మొదటి సారి దీక్ష స్వీకరించిన వారు) కచ్చితంగా నలుపు దుస్తులనే ధరించాలి.
● కాళ్లకు చెప్పులు ధరించరాదు.
● ప్రతి సీ్త్రని (భార్యను సైతం) దేవి స్వరూపాలుగా భావించాలి.
● రోజుకు ఒక్క పూట మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి. రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి.
● ఉదయం పాలు పండ్లు మాత్రమే ఆరగించాలి.
● పగటి పూట నిద్ర పోరాదు.
● మద్యం, మాంసం, ధూమపానం, తాంబూలం నిషేధం.
● తల్లిదండ్రులకు, గురుస్వాములకు, తోటి అయ్యప్పలకు, దైవానికి, మహాత్ములకు మాత్రమే నమస్కారం చేయాలి.
స్వాముల హోదా
కన్నెస్వామి: మొదటి సారి దీక్షను
స్వీకరించిన వారు
కత్తి స్వామి: వరుసగా రెండో సారి
దీక్ష తీసుకున్న వారు
గంటస్వామి: వరుసగా మూడో సారి
దీక్ష స్వీకరించిన వారు
గదస్వామి: వరుసగా నాలుగోసారి
దీక్ష తీసుకున్న వారు
పెరుస్వామి: వరుసగా ఐదో సారి
దీక్షను స్వీకరించిన వారు
గురుస్వామి: వరుసగా ఆరోసారి దీక్షను
తీసుకున్నవారు.


