దీక్షతో అనంత పుణ్యఫలం
హరిహర సుతుడు అయ్యప్పస్వామి అవతారమే ఒక అద్భుతం. మనుషుల్లో స్వార్థాన్ని రూపు మాపేందుకు అరిషడ్వర్గాలైన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలను నిర్మూలించడమే అయ్యప్ప ఆరాధన లక్ష్యం. దీక్షను ఎంత నిష్టగా ఆచరిస్తే అంత పుణ్య ఫలం సిద్ధిస్తుంది. కార్తీక మాసం మొదలు కొని మకర జ్యోతికి వెళ్లే వారు డిసెంబర్ 3వ తేదీ వరకు దీక్ష స్వీకరించవచ్చు.
– బాలస్వామి, పూజారి,
భాస్కర్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయం
దీక్షా కాలం మండలం రోజులు దేహమే దేవాలయంగా అష్టరాగాలు, పంచేంద్రియాలు, త్రిగుణాలు, అవిద్యలకు దూరంగా బ్రహ్మచర్యం, చన్నీటి స్నానం, దీపారాధనలు, అయ్యప్ప శరణుఘోష, సాత్వికాహారంతో దీక్షను పాటించాలి. ఈ సమయంలో పాటించే నియమాలను దీక్షానంతరం కూడా పాటిస్తే ఆరోగ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది
– సత్యనారాయణ, గురుస్వామి, 21వ పడి
అయ్యప్ప స్వామి దీక్ష మండల కాలం జీవన విధానంలో ప్రత్యేకంగా ఉంటుందని చాలా మంది గురు స్వాములు చెప్పారు. దీంతో ఐటీఐ చదువుతున్న నేను మొదటి సారి దీక్ష స్వీకరించాను. చాలా ప్రత్యేకంగా జీవన విధానం మారింది. నియమ నిష్టలతో నిత్యం అయ్యప్పను సేవిస్తూ దీక్షను కొనసాగిస్తున్నాను. ఉదయం, సాయంత్రం ఆలయానికి వెళ్లటం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతత కలుగుతోంది.
– ఈశ్వర్, కన్నెస్వామి
దీక్షతో అనంత పుణ్యఫలం


