
కాలనీ సమస్యలపై ‘ఫ్లెక్సీ’
వెల్దుర్తి: పట్టణంలోని రాణితోట కాలనీవాసులు స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కాలనీ ముఖద్వారంలో ఓ ఫ్లెకీని ఏర్పాటు చేసి అందులో సమస్యలను ప్రస్తావించారు. ఈ ఫ్లెక్సీ పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. స్థానిక మేజర్ పంచాయతీ పరిధిలోని రాణితోట వీధిలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. కుళాయిల పైప్‌లైన్ వేసిన తర్వాత కంకర, సిమెంట్‌తో మూయకపోవడం, కాలువలు కాదని దారిలోకి ఇళ్ల నిర్మాణాలు ముందుకురావడంతో గుంతలు తోడు దారి సమస్య తీవ్రమైంది. కొన్ని చోట్ల మురుగు కాలువులు లేవు. ఈ సమస్యలను తాము ఎంతమంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే ఇలా ఫ్లెక్సీ వేసి నిరసన తెలిపినట్లు కాలనీవాసులు తెలిపారు.