
బడ్జెట్ ల్యాప్స్ ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నాం
ఇయర్ మార్క్‌డ్ ఫండ్ కింద ఎస్సీ, ఎస్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు సంబంధించిన పనులను ఈ నెలాఖరుకు పూ ర్తి చేయకుంటే కేటాయించిన బడ్జెట్ ల్యాప్స్ అయ్యే ప్రమా దం ఉంది. ఈ విషయమై ఇప్పటికే సంబంధిత ఇంజనీరింగ్ శాఖలను హెచ్చరించాం. ఇదే విషయాన్ని స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీ చైర్మన్ ప్రత్యేకంగా సమీక్షించారు. పురోగతిలో ఉన్న పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కోరుతున్నాం. – జి.నాసరరెడ్డి, జెడ్పీ సీఈఓ
జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఇయర్ మార్క్‌డ్ ఫండ్ కింద చేపట్టిన పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన డీఈఈలతో మాట్లాడి ఆయా పనులను పూర్తి చేయాలని కోరాం. నిధులు ల్యాప్స్ అయ్యే ప్రమాదాన్ని వారికి గుర్తు చేసి పనులను పూర్తి చేయాలని చెబుతున్నాం. బిల్లుల జాప్యం కారణంగా ముందుకు రాని కాంట్రాక్టర్లతో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం.
– ఎస్‌ఈసీ మద్దన్న, పీఆర్ ఇన్‌చార్జి ఎస్‌ఈ

బడ్జెట్ ల్యాప్స్ ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నాం