
సుళువాయిలో దాహం..దాహం!
హొళగుంద: వర్షాలు కురుస్తూ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నా సుళువాయి గ్రామంలో మాత్రం తాగునీటి ఎద్దడి నెలకొంది. విరుపాపురం వాటర్ స్కీం నుంచి వారానికో, రెండు వారాలకో మంచినీరు వస్తుండగా అవి సరిపోక గ్రామ ప్రజల దాహంతో అల్లాడుతున్నారు. విరుపాపురం నీటి పథకం నుంచి మంచినీరు సక్రమంగా వదలటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ గ్రామానికి సక్రమంగా నీరు అందడం లేదని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి సర్పంచ్ మౌలాలి తీసుకెళ్లినా ఫలితం కనబడటం లేదు. దీంతో గ్రామంలో చాలా వరకు ఇంటికి ఒక తోపుడు బండిని పెట్టుకుని బోర్ల ద్వారా మినీట్యాంకులకు ఎక్కించే నీటిని తీసుకెళ్తున్నారు. ఆ నీటిని తాగేందుకు, వాడుకకు ఉపయోగిస్తున్నారు. అందుబాటులో ఉన్న ఒకటి రెండు బోరు, చేతి పంపుల వద్ద నీటి కోసం యుద్ధానికి దిగుతున్నారు. అధికారులు స్పందించి విరుపాపురం వాటర్ స్కీం నుంచి నీటి సరఫరాను సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవా లని గ్రామస్తులు కోరుతున్నారు.
విరుపాపురం స్కీం నుంచి అందని
తాగునీరు
ఇక్కడ ఇంటికో తోపుడు బండ్లు

సుళువాయిలో దాహం..దాహం!