
వివాహిత ఆత్మహత్య
ఉయ్యాలవాడ: తుడుమలదిన్నె గ్రామానికి చెందిన ఓ వివాహిత శనివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్రకు అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన మహేశ్వరి(28)తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా మహేశ్వరి అనారోగ్యానికి మానసికంగా కుంగిపోయింది. మనస్తాపంతో చెందిన ఆమె శనివారం ఉదయం ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.