
టోకెన్లు ఇచ్చారు.. యూరియా లేదంటారు!
కౌతాళం: అధికారుల ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన లేదని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. ఓ వైపు ఎరువుల కొరత లేదని అధికారులు చెబుతుంటే.. నెల రోజులుగా నిరీక్షిస్తున్నామని రైతులు రోడ్డెక్కారు. రెండు నెలల నుంచి రైతులకు రైతు సేవా కేంద్రాల చుట్టూ తిప్పకుంటున్నారే తప్ప యూరియా ఇవ్వడం లేదు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ మంగళవారం కౌతాళంలో రైతులు రోడ్డెక్కా రు. గత నెల 15వ తేదీన కొందరికి, 17వ తేదీన మరి కొంత మంది రైతులకు యూరియా కోసం డబ్బులు తీసుకుని టోకెన్లు ఇచ్చారు. ఇప్పటికే 28 రోజులు గడిచినా యూరి యా లేక పోవడంతో ఆందోళన చెందారు. మంగళవారం రైతు సేవా కేంద్రానికి యూరియా లోడ్ వచ్చిందన్న విషయం తెలుసుకున్న రైతులు తరలివచ్చారు. అయితే డబ్బులు తీసుకుని టోకెన్లు రాసి ఇచ్చిన వారికే యూరియా తక్కువ వస్తుందని, మిగతా వారికే ఎలా ఇవ్వాలని ఎంపీఈఓ కార్తీక్ రైతులను సముదాయించారు. అందరికీ యూరి యా ఇవ్వాలని, వ్యవసాయాధికారి శేషాద్రిని పిలిపించాలని రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఏఓ అక్కడికి చేరుకుని నెల క్రితమే టోకెన్లు తీసుకున్న వారికి మూడు బస్తాల చొప్పున యూరి యా ఇచ్చి మిగితాది వేరే రైతులకు ఇస్తామని చెప్పా రు. అయితే నెల రోజుల క్రితం డబ్బులు కట్టి నిరీక్షిస్తున్న తమ యూరియా ఇవ్వక పోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రైతులను కూటమి ప్రభుత్వం ఇక్కట్లకు గురి చేస్తుందని విమర్శించారు.

టోకెన్లు ఇచ్చారు.. యూరియా లేదంటారు!