
గంగలో చేపల వరద!
మహానంది: నిండుగా ప్రవహిస్తున్న తెలుగుగంగలో జాలర్ల వల నిండుతోంది. వీబీఆర్ నుంచి కృష్ణా జలాలు దిగువగా విడుదల చేయడంతో కాల్వలో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో మహానంది సమీపంలోని అయ్యన్ననగర్ గ్రామం వద్ద మహానంది ఆలయ కోనేరు నీరు వెళ్లేందుకు తెలుగు గంగ కాలువపైన ఏర్పాటు చేసిన సబ్ చానల్ వద్ద స్థానికులు వలలు ఏర్పాటు చేశారు. అక్కడే నీరు తొణుకులు తొక్కుతూ గలగల పారుతుంది. గంగ కాలువలో నుంచి పెద్దపెద్ద చేపలు ఎగిరిపడుతూ వలలో పడుతున్నాయి. ఒక్కొక్క చేప సుమారు 15 కిలోల నుంచి 20 కిలోల వరకు ఉండటంతో వారి పంట పడుతోంది.

గంగలో చేపల వరద!

గంగలో చేపల వరద!