ఉన్నత చదువులతో రాణించాలి
● రాష్ట్ర స్థాయిలో కర్నూలు సంక్షేమ విద్యార్థుల ప్రతిభ
కర్నూలు(అర్బన్): ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు 83.91 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే అత్యుత్తమ ప్రతిభను చాటారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు మరింత ఉన్నత చదువులు చదివి ఉత్తమ భవిష్యత్తును అందుకోవాలని కోరారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు సహకారం అందించిన వసతి గృహ సంక్షేమాధికారులను కూడా ఆయన అభినందించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ మెడల్స్, నూతన వస్త్రాలను బహూకరించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జె.రంగలక్ష్మిదేవి, సహాయ సాంఘిక సంక్షేమాఽధికారులు కె.బాబు, బి.మద్దిలేటి, వసతి గృహ సంక్షేమాధికారిణులు బి.బెన్నమ్మ, రజినమ్మ, క్రాంతికుమార్ పాల్గొన్నారు.
ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు:
కె.రాఘవేంద్ర(958),కె.రోజ(955), ఎస్.సలీమా (953), ఎం.సాయిప్రసాద్(935), కె.తరుణ్(933), బి.దస్తగిరమ్మ(926), ఎం.ప్రభావతమ్మ(919).


