వైభవంగా గోపాలదాస మధ్యారాధన
ఆదోని అర్బన్: పట్టణ శివారులోని శ్రీ మంగరాయ ఆంజనేయస్వామి సన్నిధిలో గోపాలదాసుల మధ్యారాధన వేడుకలు ఆదివారం వైభవంగా సాగాయి. మంగరాయ ఆంజనేయస్వామికి, గోపాలదాసులకి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం గోపాలదాస వారి చిత్రపటంతో పల్లకీసేవ నిర్వహించారు. మంగరాయ ఆంజనేయస్వామి చుట్టూ ఆలయ ప్రాంగణంలో రథోత్సవం చేశారు. బ్రాహ్మణసేవా సంఘం అధ్యక్షుడు నకాతే శ్రీధర్, పండితుడు గరుడాద్రి దత్తాత్రేయశర్మ సమక్షంలో చిన్నారులకు వకృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు. బ్రాహ్మణసేవా సంఘం ప్రధాన కార్యదర్శి మఠం రామచంద్రశర్మ, ఆరాధనకర్త వినోద్, భజన మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా గోపాలదాస మధ్యారాధన


