జాతీయ స్థాయి పోటీలకు వర్షిత
కృష్ణగిరి: స్థానిక కస్తూర్బా విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న గొల్ల వర్షిత జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ చైతన్య స్రవంతి ఆదివారం తెలిపారు. డిసెంబర్ 29న కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి అసోషియేషన్ రగ్బీ పోటీల్లో ప్రతిభ కనపరచడంతో జాతీయస్థాయికి ఎంపికై నట్లు చెప్పారు. ఈ నెల 13 నుంచి భువనేశ్వర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో వర్షిత పాల్గొననున్నట్లు తెలిపారు. అలాగే స్కూల్ గేమ్స్‌లో కూడా జాతీయస్థాయికి ఈ బాలిక ఎంపిక అయ్యారని, పోటీలు ఈ నెల చివరల్లో జరుగుతాయని చెప్పారు. విద్యార్థిని ఎంపికకు కృషి చేసిన పీఈటీ సుప్రియను ఆమె అభినందించారు.


