
కర్నూలు (టౌన్): ఆంధ్రప్రదేశ్ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు అబ్జర్వర్‌గా మున్సిపల్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ దాసరి సుధీర్ ఎంపికయ్యారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర కార్యదర్శి ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన కర్నూలు జిల్లా హాకీ సంఘం కార్యదర్శి, మున్సిపల్ ఫిజికల్ డైరెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ స్థాయి క్రీడాకారుడిగా, ఎన్నో సార్లు రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉంది. ఈ నెల 8 నుంచి 10 వ తేదీ వరకు విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఆయనను ఎంపిక చేయడంపై పలు క్రీడాసంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment