ఆదోని–2 తహసీల్దార్ కార్యాలయంగా సర్వేయర్ల గది
ఆదోని రూరల్: ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్లు కూర్చొంటున్న గదినే ఆదోని మండలం–2 తహసీల్దార్ కార్యాలయంగా మార్చారు. పూజలు చేసి బుధవారం ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆదోని మండలాన్ని రెండుగా విభజించి ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మండలం–2 తహసీల్దార్ కార్యాలయం ప్రారంభంలో తహసీల్దార్ శేషఫణి, డిప్యూటీ తహసీల్దార్ బాబు, జెడ్పీటీసీ అరుణమ్మ, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 22 గ్రామాలతో కూడిన ఆదోని–2 తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, భూ సమస్యలు ఉన్న వారు ఇక్కడే పరిష్కరించుకోవాలని తహసీల్దార్ సూచించారు.


