ఆగిన లారీని ఢీకొన్న ఆర్‌టీసీ బస్సు
బస్సు డ్రైవర్ మృతి,
కోడుమూరు రూరల్: కోడుమూరు – కర్నూలు రహదారిలో ప్యాలకుర్తి సమీపంలో బుధవారం తెలవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఆర్టీసీ డిపో డ్రైవర్ మృతి చెందాడు. కోడుమూరు పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కల్యాణదుర్గం డిపో నుంచి మంగళవారం రాత్రి గుంతకల్లు, కోడుమూరు మీదుగా హైదరాబాద్‌కు ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు బయలుదేరింది. మార్గమధ్యలో అర్ధరాత్రి దాటిన తర్వాత కోడుమూరు – కర్నూలు రోడ్డులో ప్యాలకుర్తి సమీపంలో తమిళనాడుకు చెందిన ఓ లారీ ఆగివుంది. ఇదే సమయంలో నిద్రమత్తులో ఉన్న బస్సు డ్రైవర్ బాషా ఆగివున్న లారీని గమనించకుండా వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సులో కుడి వైపు ఉన్న సహచర డ్రైవర్ శ్రీనివాసులుతో పాటు, ప్రయాణికులు విజయ్, బసిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. మరి కొందరు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న కోడుమూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని 108లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బస్సు డ్రైవర్ శ్రీనివాసులు మృతి చెందాడు. ఈ మేరకు కోడుమూరు ఎస్‌ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్యాలకుర్తి సమీపంలో వారం రోజుల వ్యవధిలో ఇది రెండో రోడ్డు ప్రమాదం కావడం గమనార్హం.
31కెడిఎం 62, 62ఎ: 31కెడిఎం 62సి ః
చికిత్స పొందుతూ మృతిచెందిన
ఆర్‌టీసీ డ్రైవర్ శ్రీనివాసులు
ఇద్దరికి తీవ్ర గాయాలు


