కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

- - Sakshi

కర్నూలు: కొక్కెరంచ గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. కొక్కెరంచ గ్రామానికి చెందిన నరేంద్రగౌడుకు పాములపాడు మండలం బానకచెర్ల గ్రామానికి చెందిన ఈడిగ లావణ్య(24)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం కుటుంబ కలహాలతో భర్తతో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన లావణ్య విషగుళికలు మింగి అపస్మారక స్థితికి చేరుకుంది.

కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. కాగా లావణ్య భర్త నరేంద్రగౌడు, అత్త, మామలు కలిసి పథకం ప్రకారమే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపించారు. తనకు న్యాయం జరిగేవరకు పోస్టుమార్టరు నిర్వహించేది లేదని హాస్పిటల్‌ మందు మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. ఎస్‌ఐ హుస్సేబాషను వివరణ కోరగా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Read latest Kurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top