కర్నూలు(అగ్రికల్చర్): వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు జవాబుదారీతనంతో పని చేయాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్‌లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయల్ యువర్ సీఎండీ, డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమానికి వచ్చే కాల్స్ పట్ల ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉండాలని, అప్పుడే సమస్యలను సత్వరం పరిష్కరించే వీలుంటుందన్నారు. కార్యక్రమంలో డీఈఈ విజయ బాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


