గుడ్లవల్లేరు: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల(ఎస్‌ఆర్‌జీఈసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన జేఎన్‌టీయూకే అంతర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఆ కాలేజీ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. కోదండ రామారావు సోమవారం వివరాలు చెబుతూ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అంతర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ విజేతలుగా ఎస్‌ఆర్‌జీఈసీ, లకిరెడ్డి బాలరెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్(ఎల్‌బీఆర్‌సీఈ) మైలవరం గెలుపొందాయన్నారు. పురుషుల విభాగంలో 63 పాయింట్లతో ఎల్‌బీఆర్‌సీఈ మైలవరం జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలవగా, మహిళల విభాగంలో 163 పాయింట్లతో ఎస్‌ఆర్‌జీఈసీ జట్టు చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుందని వివరించారు. వీరితో పాటు వ్యక్తిగత విభాగాల్లో విజేతలకు కోదండరామారావుతో పాటు పీజీసీఆర్‌డీ డైరెక్టర్ డాక్టర్ జీఎస్‌ఎన్‌ఆర్‌వీ ప్రసాద్, జిమ్ కోచ్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ వి.మల్లేశ్వరరావు, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ చక్రధర్ బహుమతి ప్రదానం చేశారు.


