దుర్గమ్మకు కానుకగా బంగారు హారం | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు కానుకగా బంగారు హారం

Nov 14 2026 1:35 AM | Updated on Nov 14 2026 1:35 AM

దుర్గమ్మకు కానుకగా బంగారు హారం రాయితీ రైస్‌ను సద్వినియోగం చేసుకోండి నేటి నుంచి రాష్ట్రస్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలు తాడిగడప వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థిగా యార్లగడ్డ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ముంబైకి చెందిన భక్తులు శుక్రవారం రూ. 5లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. ముంబైకి చెందిన జీవీ వంశీకృష్ణ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి రూ. 5లక్షల విలువైన 38.700 గ్రాముల బంగారు హారాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఈవో శీనానాయక్‌ దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.

పామర్రు: ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న ధరణీ రైస్‌ను పేదలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి శివరాంప్రసాద్‌ పేర్కొన్నారు. పామర్రులోని ధరణీ రైస్‌ అమ్మకం కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధరణీ రైస్‌ నిల్వలు, నాణ్యతలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎనిమిది కేంద్రాలు ఉన్నాయని, ప్రారంభించిన 20 రోజుల నాటి నుంచి నేటి వరకు 600 క్వింటాళ్ల అమ్మకాలు జరిగాయని తెలిపారు. 26 కేజీల బస్తా కేవలం రూ.1300కే అందుబాటులో ఉందని చెప్పారు. ఈ బియ్యంలో ఎక్కువ పోషకాలు ఉన్నాయని, ఫోలిక్‌ యాసిడ్‌ పుష్కలంగా ఉంటుందని, గర్భిణులు, పిల్లలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. పీడీఎస్‌ డీటీ వెంకటరంగారావు, విక్రయ కేంద్రం నిర్వాహకులు బొగ్గరపు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌ 19 బాలురు, బాలికల హ్యాండ్‌ బాల్‌ పోటీలు తమ కళాశాల వేదికగా నిర్వహించనున్నట్లు కేబీఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి. కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ పోటీలను శనివారం సాయంత్రం 4.00 గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఈగల్‌ కోస్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ రవ్వా నీలకంఠేశ్వరరావు, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌. రామకృష్ణ, కృష్ణా జిల్లా ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ ఎస్‌. సరళకుమారి, ఎన్టీఆర్‌ జిల్లా ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ బి. ప్రభాకర్‌ తదితరులు పాల్గొంటారని తెలిపారు.

పెనమలూరు: తాడిగడప మునిసిపాలిటీ వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థిగా యనమలకుదురుకు చెందిన యార్లగడ్డ వీరబాబు పోటీ చేస్తారని వైఎస్సార్‌ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి తెలిపారు. ఆయన శుక్రవారం వివరాలు తెలుపుతూ పార్టీలో నేతలతో చర్చించిన తరువాత యార్లగడ్డ వీరబాబు పేరును ఖరారు చేశామన్నారు. అదే విధంగా 48 వార్డులకు అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు.

కూటమిలో లుకలుకలు..

కాగా కూటమిలో లుకలుకలతో అభ్యర్థుల ఎంపిక గందరగోళంగా మారింది. చైర్మన్‌ అభ్యర్థి కోసం ఐవీఆర్‌ఎస్‌లో పీతా గోపీచంద్‌, అంగిరేకుల మురళి పేర్లు వచ్చాయి. ఇక 48 వార్డులకు టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య లుకలుకలు మొదలయ్యాయి. ప్రాధాన్యం లేని స్థానాలు జనసేనకు ఇస్తున్నారని ఆ పార్టీ నేతలు గరంగరంగా ఉన్నారు. బీజేపీ 4 స్థానాలు అడగ్గా 2 స్థానాలు మాత్రమే ఇస్తామని చెప్పటంతో అభ్యంతరం తెలిపినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement