రెడ్డిగూడెం: మండలంలోని మద్దులపర్వ పంచా యతీ పరిధి అడవికోత్తూరు గ్రామ సమీపంలో పొట్టికుంట చెరువులో గల్లంతైన వ్యక్తి మృతిచెందాడు. శనివారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందం చెరువులో గాలింపుచర్యలు చేపట్టగా మృతదేహం లభించింది. అడవికోత్తూరుకు చెందిన గండ్రు నాగరాణి, గోపిరాజు దంపతులు. గోపిరాజు పశువుల కాపరిగా జీవిస్తున్నాడు. చెరువులోకి దిగిన గేదెకు కట్టిన తాడును విప్పేందుకు శుక్రవారం నాగరాజు కూడా నీటిలోకి వెళ్లాడు. ప్రమాదశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఈ సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం శనివారం చెరువులో గాలింపు చేపట్టి గోపిరాజు మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చింది. మృతుడి భార్య నాగరాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


