ఇబ్రహీంపట్నం: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ పి.శివరామాంజనేయులు పేర్కొన్నారు. ఎన్టీటీపీఎస్ ఎకాలనీలో ‘సెలబ్రేషన్స్ ఆఫ్ బ్రిక్స్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ వీక్‘ కార్యక్రమం ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ ఇంజినీర్ మాట్లా డుతూ.. పర్యావరణాన్ని కాపాడుకుంటూ ప్రకృతికి హాని కలగకుండా నీరు, విద్యుత్, ఆహారం వంటి వనరులను పొదుపుగా ఉపయోగించుకోవాల న్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అల వాటు చేసుకోవడం ఈకార్యక్రమం ముఖ్య ఉద్దేశ మని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రాథమిక విధిగా అడవులు, సరస్సులు, నదులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, వన్యప్రాణులు, జీవులపై కరుణ కలిగిఉండాలని స్పష్టం చేశారు. సెలబ్రేషన్స్ ఆఫ్ బ్రిక్స్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజి నీర్లు మారుతీ ప్రసాద్, రమణయ్య, శ్రీనివాసరావు, ప్రసాద్, గోపాల్, వెంకటరావు, డెప్యూటీ కార్యదర్శి పి.శ్రీదేవి, ఫ్యాక్టరీ మేనేజర్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.


