మోదీ విధానాల వల్లే సంక్షోభంలో ప్రజాస్వామ్యం | - | Sakshi
Sakshi News home page

మోదీ విధానాల వల్లే సంక్షోభంలో ప్రజాస్వామ్యం

Nov 8 2026 10:36 AM | Updated on Nov 8 2026 10:36 AM

కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆర్థిక సమానత్వం, ప్రజల హక్కుల కోణంలో ప్రజాస్వామ్యాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్‌ భాల్‌చంద్ర కాంగో అన్నారు. విజయవాడ గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో విశాలాంధ్ర పూర్వ సంపాదకుడు చక్రవర్తుల రాఘవాచారి ఏడో వర్ధంతి సందర్భంగా సి.రాఘవాచారి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఐజేయూ ప్రధాన కార్యదర్శి డి.సోమసుందర్‌ అధ్యక్షతన శనివారం ‘సంక్షోభంలో ప్రజాస్వామ్యం’ అంశంపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భాల్‌చంద్ర కాంగో మాట్లాడుతూ దేశంలో ప్రధాని మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న వినాశకర విధానాల కారణంగానే ప్రజాస్వామ్యం సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. పాలకుల అనాలోచిత, తప్పుడు విధానాల వలనే ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం పెరిగాయన్నారు. దీంతో చాలా దేశాల్లో ప్రజలు, ముఖ్యంగా యువత రోడ్డెక్కుతున్నారని గుర్తుచేశారు. విద్య, శాసీ్త్రయ దృక్పథం, సమాజంపై అవగాహన ఎంతో ముఖ్యమన్నారు. జాతీయవాదం, ఆర్థిక వనరులు, ఆర్థిక ప్రయోజనాలన్నీ ప్రజల సంక్షేమం కోసమే వినియోగించాలన్నారు. కానీ పాలకులు వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఎస్‌ఐఆర్‌ కోసం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించేందుకు సుప్రీంకోర్టు, ప్రధాని ప్రయత్నం చేయడం లేదన్నారు. ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ తదితర దేశాల్లో నెలకొన్న సంక్షోభాన్ని వివరిస్తూ, ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని డిమాండ్‌ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ కె.జ్యోతి మాట్లాడుతూ ట్రస్ట్‌ కార్యకలాపాలను వివరించారు.

సీపీఐ జాతీయ నాయకుడు

డాక్టర్‌ భాల్‌చంద్ర కాంగో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement