రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు

Nov 8 2026 10:36 AM | Updated on Nov 8 2026 10:36 AM

రూ.3.50 లక్షల ఆభరణాలు స్వాధీనం

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): రైళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద రూ.3.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ పి.కనకారావు కథనం మేరకు.. రైళ్లలో ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు, లగేజీ బ్యాగులు, ల్యాప్‌టాప్‌ల చోరీ ఘటనలపై పోలీసులకు ఫిర్యా దులు అందాయి. పోలీసులు కేసులు నమోదు చేసి నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. రైల్వే డీఎస్పీ ఆర్‌.జి జయసూర్య పర్యవేక్షణలో జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ పి.కనకారావు ఆధ్వర్యంలో జీఆర్పీ, ఆర్‌పీఎఫ్‌, ఆర్‌పీఎఫ్‌ క్రైమ్‌ ఇంటిలిజెన్స్‌ బ్రాంచ్‌ సిబ్బంది సమన్వయంతో సాంకేతిక పరిజ్ఞానంతో చోరీలకు పాల్పడింది నెల్లూరుకు చెందిన సునీల్‌కుమార్‌గా గుర్తించారు. అతడి కోసం గాలింపు చేపట్టి, ప్రస్తుతం నార్త్‌వెస్ట్‌ ఢిల్లీలోని ముబారక్పూర్‌ దాబాస్‌ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. అతడిని అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు. విచారణలో జీఆర్పీ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన మూడు కేసుల్లో చోరీలకు పాల్పడినట్లు అంగికరించాడు. అతని వద్ద రూ.3.50 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement