దుర్గమ్మ సేవలో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సేవలో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

Nov 8 2026 10:36 AM | Updated on Nov 8 2026 10:36 AM

దుర్గమ్మ సేవలో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ మహిళా ఉద్యోగుల రక్షణకు ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, ఒక వేళ ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని పరిష్కరించేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేస్తున్నా మని ఆలయ ఈఓ శీనానాయక్‌ తెలిపారు. దుర్గగుడిలో విధులు నిర్వహించే మహిళా సిబ్బందితో ఈఓ, ఏఈఓ ఎన్‌.రమేష్‌బాబు, ఈఈ ఎల్‌.రమా, సూపరింటెండెంట్‌ హేమ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈఓ శీనానాయక్‌ మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక, నిషేధ, పరిష్కార చట్టం–2013 నిబంధనల మేరకు ఈ కమిటీని నియమించామని తెలిపారు. మహిళా సిబ్బంది తమ సమస్యలను బయట వ్యక్తులతో చెప్పకోలేరని, తోటి మహిళలతో నిస్సంకోచంగా పంచుకోగలరనే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా ఈఈ ఎల్‌.రమా, సభ్యులుగా ఏఈఓ ఎన్‌.వి.లక్ష్మీప్రసన్న, సూపరింటెండెంట్‌ హేమదుర్గాంబ వ్యవహరిస్తారని ఈఓ శీనా నాయక్‌ పేర్కొన్నారు. ఎస్టీవీఆర్‌ స్కూల్లో ఆర్జేడీ తనిఖీలు మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): దుర్గాపురం ఎస్టీవీఆర్‌ నగరపాలక సంస్థ పాఠశాలను విద్యాశాఖ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (ఆర్జేడీ) జి. నాగమణి శనివారం సందర్శించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు, వసతులను తనిఖీచేశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పబ్లిక్‌ పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. వంటశాల పరిశుభ్రతను పరిశీలించి ఆహార పదార్థాలను రుచి చూశారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి, ఆహార నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది పదో తరగతి ఫలితాలను ఆర్జేడీ నాగమణి సమీక్షించారు. విద్యార్థుల నూరుశాతం హాజరు, మిషన్‌ మార్చ్‌ కార్యక్రమం అమలు, అభ్యసనా ఫలితాల మెరుగుదల, పాఠశాలలో భద్రతా ప్రమాణాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన డ్రీమ్‌వాల్‌ను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులు తమ లక్ష్యాలు భవిష్యత్‌ ఆశయాలను స్వయంగా రాసిన విధానాన్ని అభినందించారు. అనంతరం పాఠశాలలో మంచి పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులను సత్కరించారు. కృష్ణా విశ్వవిద్యాలయం చెస్‌ జట్టు ఎంపిక

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ శనివారం దర్శించుకున్నారు. కుటుంబ సమే తంగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన కలెక్టర్‌కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం కలెక్టర్‌కు వేద పండితులు ఆశీర్వచనం, ఆలయ ఏఈఓ ఎన్‌.రమేష్‌బాబు, ఆలయ అర్చకుడు రంగా వజ్జుల శ్రీనివాసశాస్త్రి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): హైదరాబాద్‌లోని వాక్సిన్‌ విశ్వవిద్యాలయంలో జరిగే దక్షిణ భారత అంతర్‌ విశ్వవిద్యాలయం మహిళల చెస్‌ పోటీల్లో ప్రాతినిధ్యం వహించే కృష్ణా విశ్వవిద్యాలయం జట్టును తమ కళాశాల ఆవరణలో శనివారం ఎంపిక చేశామని సప్తగిరి కళాశాల ప్రిన్సిపాల్‌ ఆర్‌.రఘురామ్‌ తెలిపారు. అంతర్‌ విశ్వవిద్యాలయం మహిళల చెస్‌ పోటీపోటీలు ఆదివారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. కృష్ణా యూనివర్సిటీ జట్లు సభ్యులుగా కె.శ్రీ హైందవీ శర్వాణీ (ఎస్‌వీడీ లా కళాశాల విజ యవాడ), జె.సాయిహర్షిత (కేబీఎన్‌ కళాశాల), జె.తిరుపతమ్మ (సిద్ధార్థ దుర్గాల్లేశ్వర స్వామి మహిళా కళాశాల), ఎం.పల్లవి (కేవీ ఎస్‌ఆర్‌ సిద్ధార్థ ఫార్మాస్యూటికల్‌ కళాశాల)ను ఎంపిక చేశామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement