న్యూస్‌రీల్
ఉదయం వేళ పోటెత్తి.. సాయంత్రం తగ్గిన ఓటర్లు మచిలీపట్నం కార్పొరేషన్‌లో 70.83 శాతం ఓటింగ్ నమోదు పెడనలో 79.42, ఉయ్యూరులో 76.17 శాతంగా నమోదైన పోలింగ్
పోలింగ్ సరళి ఇలా..
సోమవారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2026
పెడన పోలింగ్
కేంద్రం నుంచి బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తున్న ఎన్నికల అధికారులు, సిబ్బంది
చిలకలపూడి(మచిలీపట్నం): మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం కృష్ణాజిల్లాలో ముగి సింది. మచిలీపట్నం నగరపాలక సంస్థతో పాటు పెడన, ఉయ్యూరు మునిసిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియను నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం వరకు ఓటర్లు బారులు తీరి ఉన్నప్పటికీ అనంతరం ఓటర్లు తమ ఓటును వినియోగించుకునేందుకు అంతగా పోలింగ్ కేంద్రాలకు రాకపోవటం గమనార్హం. మచిలీపట్నం నగర పాలకసంస్థలో మొదటిసారి ఎన్నికలు జరిగిన సమయంలో 72 శాతం పోలింగ్ నమోదు కాగా రెండోసారి జరిగిన ఈ ఎన్నికల్లో 70.83 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా యంత్రాంగం సూచనలు చేసినప్పటికీ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అంత ఉత్సాహం చూపకపోవటంతో ఈసారి పోలింగ్ శాతం మరింత తగ్గింది.
ఓటర్ల వివరాలు..
వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి పరిశీలన..
జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా ఆయా డివిజన్లు, వార్డుల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహణ తీరును పర్యవేక్షించి సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు.
బందరు బలరాముని పేట గాంధీ విధ్యాలయం వద్ద బారులు తీరిన ఓటర్లు
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ 9 గంటల వరకు నమోదు చేసిన పోలింగ్ శాతం ప్రకారం మచిలీపట్నం 11.96 శాతం, పెడన 14.33, ఉయ్యూరు 9.59 శాతం నమోదయ్యాయి. అనంతరం 11 గంటలకు నమోదైన పోలింగ్ శాతంలో మచిలీపట్నం 29.06, పెడన 32.77, ఉయ్యూరు 25.11 శాతం నమోదయ్యాయి. అనంతరం 1.00 గంటలకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు చూస్తే కొద్దిగా పోలింగ్ శాతం పెరిగింది. మచిలీపట్నం 47.85 శాతం, పెడన 50.68 శాతం, ఉయ్యూరు 46.83 శాతం నమోదైంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు జరిగిన పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే మచిలీపట్నం 55.1 శాతం, ఉయ్యూరు 59.35, పెడన 65.79 శాతం వచ్చాయి. తుది పోలింగ్ శాతంలో మచిలీపట్నం 70.83 శాతం, పెడన 79.42 శాతం, ఉయ్యూరు 76.17 శాతం నమోదైంది. ఈ పోలింగ్ సరళిని బట్టి చూస్తే ఉదయం ఎక్కువ మంది ఓటర్లు మచిలీపట్నం, ఉయ్యూరులో ఓటు హక్కు వినియోగించుకోగా పెడన మునిసిపాలిటీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుని పోలింగ్ సరళిలో ప్రథమంగా నిలిచారు.


