చిలకలపూడి(మచిలీపట్నం): మొరసు తుపానును ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండా లని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. ఆదివారం జిల్లా అధికారులతో కలెక్టర్‌లోని చాంబర్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మొరసు నెల్లూరు నర్సాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అర్ణబ్ తుపాను సమ యంలో చేపట్టిన ముందస్తు చర్యలను కొనసాగి స్తూనే మరింత వేగంగా స్పందించి సహాయ, పునరావాస కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించాలన్నారు. విద్యుత్ శాఖాధికారులు తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అదనపు సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అవసరమైన మేర విద్యుత్ స్తంభాలు, వైర్లు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గతంలో ఎక్కువ నష్టం సంభవించిన ప్రాంతాలను గుర్తించి సిబ్బందిని అప్ర మత్తం చేయాలన్నారు. రహదారులపై పడిపోయిన చెట్లను ఇంజినీరింగ్ శాఖాధికారులు అవసరమైన యంత్రపరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తుపాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలను ముందుగానే గుర్తించి అవసరమైన వారిని సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. టెలికాన్ఫ రెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, డీఆర్వో శ్రీధర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
చిలకలపూడి(మచిలీపట్నం): బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను నేపథ్యంలో జిల్లా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశం హాలులో ఆదివారం రాత్రి కలెక్టర్ బాలాజీ విలేకరులతో మాట్లాడారు. వాతావరణ శాఖ సూచించిన ప్రకారం సోమవారం నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించామని పేర్కొన్నారు. ఈ వర్షాలు మూడో తేదీ వరకు కొనసాగుతాయన్నారు. తుపాను నెల్లూరు, నరసాపురం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అర్నబ్ తుపానుకు సహకరించిన విధంగా దీనికి కూడా సహకరించాలని జిల్లా ప్రజలకు విజ్జప్తి చేశారు. విద్యుత్ పునరుద్ధరణ కోసం అదనపు సిబ్బందిని నియమించాలని అధికారులకు సూచించామన్నారు. రహదారులపై చెట్లు పడిపోవడం వంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే వాటిని తొలగించేందుకు యంత్ర పరికరాలను సిద్ధం చేసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించామని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు పునరావసా కేంద్రాలకు తరలిరావాలని విజ్జప్తి చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో వ్యాపారులు సోమవారం సాయంత్రం నుంచి షాపులు మూసివేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో కె శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఓటర్లకు కృతజ్ఞతలు
జిల్లాలో మునిసిపల్ ఎన్నికల విజయవంతానికి సహకరించిన ఓటర్లకు కృష్ణా కలెక్టర్ డి.కె.బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో 241 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్యను బట్టి పోలిస్ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థతో పాటు పెడన, ఉయ్యూరు మునిసిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజ్జప్తి చేశారు. ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు మాట్లాడుతూ.. జిల్లాలో 72.82 శాతం పోలింగ్ నమోదవడానికి సహకరించిన ఓటర్లకు ధన్యవాదాలను తెలిపారు.


