బ్యాలెట్‌ పత్రాల ముద్రణ 50 శాతం పూర్తి | - | Sakshi
Sakshi News home page

బ్యాలెట్‌ పత్రాల ముద్రణ 50 శాతం పూర్తి

Nov 1 2026 8:25 AM | Updated on Nov 1 2026 8:25 AM

డీపీవో ఎం.ధనలక్ష్మి జిల్లాలోని 491 గ్రామ పంచాయతీల్లో 4,780 వార్డులకు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ

చల్లపల్లి: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్‌ పత్రాల ముద్రణ ఇప్పటివరకు 50 శాతం పూర్తయిందని జిల్లా పంచాయతీ అధికారి ఎం.ధనలక్ష్మి తెలిపారు. ముద్రించిన బ్యాలెట్‌ పేపర్లను భద్రపరిచేందుకు స్థానిక పంచాయతీ కార్యాలయం పైఅంతస్తును ఎంపిక చేశారు. దీనిని శనివారం ఆమె పరిశీలించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని 491 గ్రామ పంచాయతీల్లో గల 4,780 వార్డులకు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ చల్లపల్లిలో జరుగుతున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 24వ తేదీ నుంచి ముద్రణ ప్రారంభించామని, నవంబర్‌ మొదటి వారంలో 100 శాతం ముద్రణ పూర్తిచేస్తామని చెప్పారు. ముద్రించిన బ్యాలెట్‌ పేపర్లను ఎప్పటికప్పుడు చల్లపల్లి పంచాయతీ కార్యాలయంపైన ఉన్న స్ట్రాంగ్‌ రూములో భద్రపరుస్తున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ఎన్నికల తేదీల ఆధారంగా చల్లపల్లి నుంచి ఆయా పోలింగ్‌ స్టేషన్ల ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, వాటిని భద్రపరుస్తున్న స్ట్రాంగ్‌ రూమును పరిశీలించి అధికారులు, స్బిబందికి పలు సూచనలు చేశారు. డీఎల్‌పీవో ఎం.డి.రజావుల్లా, ఈఓ మాధవేంద్రరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement