గెలుపునకు సహకరించండి | - | Sakshi
Sakshi News home page

గెలుపునకు సహకరించండి

Oct 28 2026 6:00 AM | Updated on Oct 28 2026 6:00 AM

● మచిలీపట్నం నగరపాలక సంస్థలో మేయర్‌ అభ్యర్థి లంకా జ్యోతి కలెక్టరేట్‌లోని అన్ని శాఖల్లోని ఉద్యోగులకు అభివాదం చేస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం నగరంలోని 4, 5, 8 డివిజన్లలో ప్రచార వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అబద్ధాలు, అసత్యాలు మాట్లాడే వారికి బుద్ధి చెప్పి వైఎస్సార్‌ సీపీ విజయానికి సహకరించాలని కోరారు. ప్రచారంలో మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సలార్‌దాదా, మాజీ డెప్యూటీ మేయర్‌ లంకా సూరిబాబు, వైఎస్సార్‌ సీపీ నాయకులు చిటికిన నాగేశ్వరరావు, నేతలు పాల్గొన్నారు. ● పెడన పట్టణంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి కటకం నాగకుమారితో కలిసి 21, 23, 24 వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థికి, ఉప్పాల హారికకు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. తమ విజయానికి సహకరిస్తే పెడన పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ ముందుకు సాగారు. కౌన్సిలర్‌ అభ్యర్థులు కుర్మా సుజాత, వీణం రాము, కారుపర్తి హరిశ్రీరామచంద్రమూర్తి, ఇతర నేతలు పాల్గొన్నారు. ● ఉయ్యూరు మునిసిపాలిటీ పరిధిలో చైర్‌పర్సన్‌ అభ్యర్థి పైడిముక్కల దివ్య ఆయా సామాజికవర్గాల నాయకులతో సమావేశమై విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పట్టణంలోని 18, 19 వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. గతంలో ఉయ్యూరు పట్టణంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ తమ విజయానికి సహకరిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నేతలు గడ్డం చైతన్య, జంపాన కొండలరావు, షేక్‌ అబుల్‌ కలాం, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చిలకలపూడి(మచిలీపట్నం): తమ విజయానికి సహకరించాలంటూ అభ్యర్థులు మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్‌ అభ్యర్థితో పాటు ఉయ్యూరు, పెడన మునిసిపల్‌ చైర్మన్‌ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేశారు. కూటమి పాలనలో పెరిగిన నిత్యావసర ధరలను ప్రజలు గమనించాలని ఇటువంటి ప్రభుత్వంలో ప్రజలకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయని అవగాహన కల్పిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. అధికారంలోకి రాక ముందు అలవికాని హామీలు ఇచ్చిన పాలకులు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు వాటిని నెరవేర్చకుండా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని వాటిని తిప్పికొట్టే విధంగా ప్రజలు ఆలోచన చేయాలని అభ్యర్థులు ప్రచారంలో విజ్ఞప్తి చేశారు.

మేయర్‌, చైర్మన్‌ అభ్యర్థుల ముమ్మర ప్రచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement