అరాచక పాలనను అంతమొందించండి | - | Sakshi
Sakshi News home page

అరాచక పాలనను అంతమొందించండి

Oct 28 2026 6:00 AM | Updated on Oct 28 2026 6:00 AM

అరాచక పాలనను అంతమొందించండి

ఇళ్ల స్థలాలు ఏవీ?

మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌

పామర్రు: ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనను అంతమొందించాలని ప్రజలకు వైఎస్సార్‌ సీపీ పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ సూచించారు. అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్న పామర్రు ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పామర్రులోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో అనిల్‌కుమార్‌ మంగ ళవారం విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఐదేళ్ల పాలనలో కల్పించిన మౌలిక సదుపాయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేయా లని స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను కోరారు. తమను గెలిపిస్తే పారదర్శక పరిపాలన అందిస్తామని అభ్యర్థులు ప్రచారం చేయాలని సూచించారు. రెండున్నర ఏళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్న కూటమి ప్రభుత్వ అరాచక పాలనను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగాలన్నారు.

విజయమే లక్ష్యంగా పని చేయాలి

నియోజకవర్గంలోని 67 ఎంపీటీసీ స్థానాలు, ఐదు జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని కైలే అనిల్‌కుమార్‌ తెలిపారు. అన్ని స్థానాలలో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఏ ఒక్కరికీ కొత్తగా పింఛన్‌ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి పేద లకు వైద్యం అందకుండా చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ మంజూరైతే పార్టీ ఆఫీసు ఖర్చు అని రూ.10 వేల చొప్పున టీడీపీ నాయకులు దోచుకుంటున్నది వాస్తవం కాదా అని కై లే అనిల్‌కుమార్‌ ప్రశ్నించారు. టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వారికే సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులు పండించిన ధాన్యానికి మద్దుతు ధర కల్పిస్తే నేడు గిట్టుబాట ధర దక్కక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. మొవ్వ మండలంలో సాగుకు నీరు లేక వెయ్యి ఎకరాల్లో రైతులు క్రాఫ్‌ హాలిడే ప్రకటించారని పేర్కొన్నారు. తోట్లవల్లూరు మండలం లంకపల్లి గ్రామంలో 300 ఎకరాలు రీ సర్వే చేసి రూ.300 కోట్ల స్కామ్‌ చేసేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నారని విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండగా, కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీల నాయకులు మాత్రమే సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.

వర్ల కుమార్‌రాజా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి నేటి వరకు ఒక్క సెంటు ఇళ్ల స్థలం, ఒక్క పెన్షన్‌ ఇచ్చిన దాఖలాలు లేవని కైలే అనిల్‌కుమార్‌ విమర్శించారు. వక్ఫ్‌ బోర్డు భూములు కొట్టేసిన, రియల్‌ ఎస్టేట్‌ మాఫియా చేసే వ్యక్తి సతీమణి ఎంపీపీ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మట్టి, ఇసుక, రేషన్‌ బియ్యం మాఫి యాలు నడుస్తున్నాయని విమర్శించారు. జగనన్న కాలనీలతో సొంతింటి కల సాకారమైందని పేదలు సంతోషంగా ఉన్నారని, అయితే ఆ కాలనీల్లో రోడ్లు, మౌలిక వసతుల కల్పనను కూటమి ప్రభుత్వం విస్మరించిందని కైలే అనిల్‌కుమార్‌ విమర్శించారు. పామర్రులో ఇళ్ల స్థలాల లబ్ధిదారులు మూడు వేల మంది ఉండగా, వారి సంఖ్యను 800కు కుదించింది నిజం కాదా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యే కుమార్‌ రాజాకు షాక్‌ ఇస్తాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 67 ఎంపీటీసీ, ఐదు జెడ్పిటీసీ స్థానాలు ఎంతకి విక్రయించారో చెప్పాలన్నారు. వీరాంజనేయ కాలనీలో ప్లాట్లు అమ్ముకున్న మాట వాస్తవం కాదా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ పామర్రు–3వ సెగ్మెంట్‌ ఎస్టీ అభ్యర్థిపై పామర్రుకు చెందిన ఓ గజదొంగ బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆరేపల్లి శ్రీనివాసరావు, బొమ్మారెడ్డి అప్పిరెడ్డి, దేవిరెడ్డి బాల వెంకటేశ్వరరెడ్డి, ఆరుమళ్ల రమాదేవి, తాడిశెట్టి శ్రీనివాస రావు, బొమ్మారెడ్డి కృష్ణారెడ్డి, సజ్జా సుబ్రహ్మణ్యం, పల్లికొండ శివ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement