దంపతుల రాజకీయ జోడీ | - | Sakshi
Sakshi News home page

దంపతుల రాజకీయ జోడీ

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

దంపతుల రాజకీయ జోడీ పునరావాస కేంద్రాల్లో వసతులు కల్పించండి

మచిలీపట్నంలో కార్పొరేటర్‌ పదవులపై గురి

మచిలీపట్నం టౌన్‌: మచిలీపట్నం నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకి చెందిన ఇద్దరు దంపతులు ఆ పార్టీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. మాజీ డిప్యూటీ మేయర్‌ శీలం భారతి, మాజీ కౌన్సిలర్‌ శీలం బాబ్జి భార్యాభర్తలు. శీలం బాబ్జి, భారతి పాత మూడో డివిజన్లో వేర్వేరు పాలనా కాలాల్లో ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం జరిగిన పునర్విభజనలో ఈ మూడో డివిజన్‌ మూడు ముక్కలు అయ్యింది. దీంతో బాబ్జి మూడో డివిజన్లో, భారతి 8వ డివిజన్లో అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగారు. అలాగే మాజీ కార్పొరేటర్‌, వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు రాసంశెట్టి వాణిశ్రీ ఆమె భర్త జానకి రమణ (చంటి) ఈ ఎన్నికల్లో 9, 10 డివిజన్లలో అభ్యర్థులుగా బరిలో దిగారు. 9వ డివిజన్‌ కార్పొరేటర్‌గా వాణి పని చేశారు. పునర్విభజనలో 9వ డివిజన్‌ విడిపోయింది. దీంతో ఆమె భర్త చంటికి పోటీ చేసే అవకాశం వచ్చింది. ఆయా డివిజన్లలో ఇద్దరు దంపతులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ

గన్నవరం: అర్నాబ్‌ తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లాలోని పునరావాస కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయలు కల్పించాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. మండలంలోని కేసరపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. కేంద్రంలోని సదుపాయాలను తనిఖీ చేసిన ఆయన ప్రజలకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్నాబ్‌ తుపాను నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లోని వలస కార్మికులు, లోతట్టు ప్రాంత ప్రజలను ముందస్తు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, నాణ్యమైన ఆహారం అందించాలని తెలిపారు. గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, తహసీల్దారు కె. వెంకటశివయ్య తదితరులు పాల్గొన్నారు.

పూడికతీత పనుల పరిశీలన

అర్నాబ్‌ తుపాను నేపథ్యంలో బుడమేరు కాలువలో వర్షం నీరు సజావుగా ప్రవహించేలా చేపట్టిన పూడికతీత పనులు, గుర్రపుడెక్క తొలగింపు పనులను కేసరపల్లి, ఇందుపల్లి వద్ద ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుతో కలిసి కలెక్టర్‌ బాలాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నీరు సజావుగా దిగువకు ప్రవహించేలా కాలువల్లో అడ్డంకులు తొలగించాలని తెలిపారు. ఇరిగేషన్‌ ఎస్‌ఈ గుణకర్‌, డ్రైనేజీ శాఖ ఈఈ కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

శీలం భారతి, 8వ డివిజన్‌

శీలం బాబ్జి, 3వ డివిజన్‌

రాసంశెట్టి వాణిశ్రీ, 9వ డివిజన్‌

రాసంశెట్టి జానకి రమణ, 10వ డివిజన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement