ఉపరాష్ట్రపతికి స్వాగతం, వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

ఉపరాష్ట్రపతికి స్వాగతం, వీడ్కోలు

Oct 27 2026 1:50 AM | Updated on Oct 27 2026 1:50 AM

ఉపరాష్ట్రపతికి స్వాగతం, వీడ్కోలు బహిరంగ వేలంతో రూ. 5.72 లక్షల ఆదాయం హ్యాండ్‌బాల్‌ పోటీలకు ‘యనమలకుదురు’ విద్యార్థి ఇసుక లారీ ఢీ.. వ్యక్తికి గాయాలు

గన్నవరం: ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు సోమవారం గన్నవరం విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం, వీడ్కోలు లభించాయి. విజయవాడ పర్యటన నిమిత్తం ఆయన న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక వాయుసేన విమానంలో సోమవారం ఇక్కడికి చేరుకున్నారు. ఆయనకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, మంత్రి నారా లోకేశ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌, కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఉప రాష్ట్రపతి రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు వెళ్లారు. అక్కడ పర్యటన అనంతరం ఉప రాష్ట్రపతి మధ్యాహ్నం తిరిగి విమానాశ్రయానికి చేరుకోగా.. వీడ్కోలు పలికారు.

ముక్త్యాల(జగ్గయ్యపేట): గ్రామ సమీపంలోని కోటిలింగ హరిహర మహాక్షేత్రంలో పంచముఖేశ్వరుడికి బహిరంగ వేలం పాటల ద్వారా రూ. 5.72 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో హరిదుర్గానాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో సోమవారం స్వామి వారి ప్రతిష్ఠా సామగ్రి, పూజా సామగ్రి, కొబ్బరి కాయలు అమ్ముకునే హక్కుకు వేలం పాటలు నిర్వహించారు. ఈ పాటల్లో ప్రతిష్ఠ, పూజా సామగ్రికి రూ. 5.50 లక్షలు, కొబ్బరిచిప్పలు పోగు చేసుకునే హక్కుకు రూ. 17 వేలు వచ్చాయన్నారు. వేలంలో జూపూడి గ్రూపు టెంపుల్స్‌ ఈవో బొగ్గవరపు రవీంద్రబాబు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

పెనమలూరు: జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు యనమలకుదురు జెడ్పీ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి ఉసురుమోతు హర్షవర్ధన్‌ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు. ఈ మేరకు సోమవారం పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎ.రాజశేఖర్‌ వివరాలు తెలిపారు. ఇటీవల తెనాలిలో జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో హర్షవర్ధన్‌ విశేష ప్రతిభ కనబర్చడంతో అతడిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లో జరగనున్న జాతీయ హ్యాండ్‌బాల్‌ పోటీల్లో ఏపీ జట్టులో(అండర్‌–14) పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం కె.శిరీష, ఉపాధ్యాయులు హర్షవర్ధన్‌ను అభినందించారు.

పెనమలూరు: ఇసుక లారీ ఢీకొనడంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎం.సునీల్‌ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. చర్చి సమీపంలో ఇసుక లారీ వేగంగా వచ్చి అతన్ని ఢీ కొట్టింది. ఘటనలో అతని కుడికాలికి తీవ్ర గాయమై చర్మం ఊడిపోయింది. గ్రామస్తులు అతడిని విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇసుక లారీలు అతివేగంగా ప్రమాదకరంగా తిరుగుతున్నాయన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇసుక లారీలను ఆపాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement