కేబీఎన్‌ ఎన్‌సీసీ విద్యార్థికి స్వర్ణ పతకం | - | Sakshi
Sakshi News home page

కేబీఎన్‌ ఎన్‌సీసీ విద్యార్థికి స్వర్ణ పతకం

Oct 27 2026 1:50 AM | Updated on Oct 27 2026 1:50 AM

కేబీఎన్‌ ఎన్‌సీసీ విద్యార్థికి స్వర్ణ పతకం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): కేబీఎన్‌ కళాశాల ఎన్‌సీసీ ఎయిర్‌ వింగ్‌ క్యాడెట్‌ జెడ్‌ మహిత జ్యోతి జాతీయ స్థాయిలో స్వర్ణ పతకాన్ని కై వసం చేసుకుందని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కృష్ణవేణి తెలిపారు. కళాశాలలో సోమవారం జరిగిన అభినందన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చైన్నెలోని తాంబరం ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 13 వరకు నిర్వహించిన అఖిల భారత వాయు సైనిక్‌ శిబిరంలో ఆరోగ్యం–పరిశుభ్రత విభాగంలో ఈ ఘనత సాధించిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 17 డైరెక్టరేట్లకు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక శిబిరంలో మహిత జ్యోతి ప్రతిభ కనబరిచి ఏపీ, తెలంగాణ డైరెక్టరేట్‌తో పాటు కేబీఎన్‌ కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన్నట్లు పేర్కొన్నారు. ఎన్‌సీసీ ఎయిర్‌ వింగ్‌ ప్రారంభమైన తొలి సంవత్సరంలోనే విద్యార్థిని జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించడం కళాశాలకు గర్వకారణమని తెలిపారు. కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ డాక్టర్‌ టి.శ్రీనివాసు మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడలు, సాంకేతిక నైపుణ్యాలు, సేవా కార్యక్రమాల్లోనూ విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. హిందూ హైస్కూల్స్‌ కమిటీ పరిపాలనాధికారి డాక్టర్‌ వి. నారాయణరావు మాట్లాడుతూ మహిత జ్యోతి సాధించిన విజయం కళాశాలకే కాకుండా ఎన్‌సీసీ కేడెట్లందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కే రామకృష్ణ, ఎన్‌సీసీ ఆర్మీ వింగ్‌ అసోసియేట్‌ ఎన్‌సీసీ ఆఫీసర్‌ కెప్టెన్‌ కేపీటీ విజయ భాస్కర్‌, ఎన్‌సీసీ ఎయిర్‌ వింగ్‌ కేర్‌టేకర్‌ ఆఫీసర్‌ ఎహెచ్‌డీ ప్రకాశ్‌ పాల్గొని స్వర్ణ పతక విజేత మహిత జ్యోతిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement