కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అర్నాబ్ తుపాను నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి చెప్పారు. విజయవాడ గుణదలలోని ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం జరిగింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో సర్కిల్ పరిధిలో ప్రాంతాల్లో విద్యుత్ శాఖ పరంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై జిల్లా స్థాయి అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు దెబ్బతినే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు వాటిని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పుల్లారెడ్డి ఆదేశించారు.
ఏ ఉద్యోగి సెలవులు తీసుకోకూడదు
తుపాను నేపథ్యంలో సర్కిల్,డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని, తుపాను ప్రభావం దృష్ట్యా ఏ విద్యుత్ ఉద్యోగి సెలవు తీసుకోవడానికి వీలు లేదని పుల్లారెడ్డి చెప్పారు. ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ మురళీకృష్ణ యాదవ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టీవీఎస్‌ఎన్ మూర్తితో పాటుగా అధికారులు పాల్గొన్నారు.
ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి
కృష్ణా జిల్లా : 62817 09355
ఎన్టీఆర్ : 94408 17561
బాపట్ల : 92814 13774
గుంటూరు : 94408 17526
ప్రకాశం : 94408 17491
పల్నాడు : 76610 19447


