వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

Oct 27 2026 1:50 AM | Updated on Oct 27 2026 1:50 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ మహోత్సవం సోమవారం వైభవంగా, కనులపండువగా సాగింది. దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. తెల్లవారుజామున 5.55 గంటలకు ఘాట్‌రోడ్డు వద్ద ప్రత్యేకంగా అలంకరించిన పూల రథంపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల ఉత్సవ మూర్తులకు, దేవస్థాన ప్రచార రథంపై ఆదిదంపతులకు అర్చకులు నిర్వహించారు. డీఈవో కిషోర్‌కుమార్‌ ప్రచార రథానికి కొబ్బరి కాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, చిన్నారుల కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలతో ఊరేగింపు ముందుకు సాగింది. ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సిబ్బంది భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపులో పాల్గొన్నారు. ఘాట్‌రోడ్డు నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ కుమ్మరి పాలెం, విద్యాధరపురం, సితారా, కబేళా, పాలప్రాజెక్టు, చిట్టినగర్‌, కేటీరోడ్డు, కొత్తపేట, బ్రహ్మణ వీధి మీదగా సుమారు 8 కిలోమీటర్లు సాగింది. గిరిప్రదక్షిణలో భాగంగా ప్రచార రథంపై కొలువు దీరిన శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లు ముందుకు సాగే మార్గాన్ని భక్తులు పసుపు నీళ్లతో శుభ్రం చేసి హారతిలిచ్చి స్వాగతం పలికారు. గిరిప్రదక్షిణలో పాల్గొంటే తమ కోర్కెలు తీరడమే కాకుండా సంతానానికి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయని భక్తులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిఽధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విశాఖపట్నంకు చెందిన భక్తులు సోమవారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. విశాఖపట్నం కూర్మంపాలెంకు చెందిన పొట్లూరి శేషారత్నం కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని అందజేసింది. తలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ డీఈవో కిషోర్‌కుమార్‌ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement