సమస్యల పరిష్కారమే లక్ష్యం పెడన: ‘పురప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల బరిలో నిలిచా. పెడన పట్టణాన్ని పీడిస్తున్న పారిశుద్ధ్య సమస్యను పరిష్కరిస్తా. ప్రజలకు రోజూ రక్షిత తాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటా. వైఎస్సార్ సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు గత పాలకవర్గంలో రెండున్నరేళ్లు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించా. మరో ఐదేళ్లు పురప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలిచా. ప్రజలు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది.’ అని వైఎస్సార్ సీపీ పెడన మునిసిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి కటకం నాగకుమారి అన్నారు. తాను గెలిస్తే ప్రజలకు అందించే సేవలు, చేపట్టే అభివృద్ధి పనులపై ‘సాక్షి’తో మాట్లాడారు.
జవాబు: నా తల్లిదండ్రులు దైవపు కోటేశ్వరమ్మ, కృష్ణారావు. నా భర్త కటకం బాబు దుర్గావెంకట వరప్రసాద్. మా కుమారుడు నాగసతీష్ వివాహితుడు. నా భర్త 2014, 2019లో వైఎస్సార్ సీపీ నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందారు. గృహిణిగా ఉన్న నేను 2021లో కౌన్సిలర్‌గా గెలిచాను. పార్టీ అధిష్టానం ఆదేశాలతో రెండున్నరేళ్లకు పైగా చైర్‌పర్సన్‌గా బాధ్యతలను నిర్వర్తించాను. నాపై నమ్మకంతో చైర్‌పర్సన్‌గా పోటీ చేసేందుకు పార్టీ అవకాశం కల్పించింది.
జవాబు: నేను 31 నెలలు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించా. ముస్లిం కబరస్తాన్‌కు రూ.10 లక్షలతో ప్రహరీ నిర్మాణం చేపట్టాం. రూ.30 లక్షలతో వాటర్ హౌస్‌లో వాటర్ బెడ్‌లను శుభ్రం చేయించి, అత్యాధు నిక మోటార్లను కొనుగోలు చేసి బిగించాం. హిందూ శ్మశానవాటిక ప్రహరీ నిర్మాణం చేపట్టాం. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ పనులు నిలిచిపోయాయి. మునిసిపాలిటీకి వచ్చే వివిధ రకాల నిధులతో ఏడో వార్డులో డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాం. ఇది అసంపూర్తిగానే ఉంది. గెలిచాక దీనిని పూర్తి చేస్తాం. జోగానందరావు కాలనీలో సీసీ రోడ్డు నిర్మించాం. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశాం. మా హయాంలోనే డంపింగ్ యార్డు క్లియరెన్సుకు సంతకాలు పూర్తయ్యాయి.
జవాబు: పదవులు ముఖ్యం కాదు. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉండి సేవ చేయాలనే సంకల్పంతో పోటీలో నిలబడ్డాం. వైఎస్సార్ సీపీ హయాంలో అందజేసిన సంక్షేమ ఫలాలను దృష్టిలో ఉంచుకుని ఓట్లు అడిగేందుకు సిద్ధమయ్యాం. నాతో పాటు పట్టణంలోని 28 వార్డుల్లో నిలబడిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి రెండు ఓట్లు సిలింగ్ ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరుతున్నా.
ప్రశ్న: మీరు గెలిచాక ఏ అభివృద్ధి పనులు చేపడ్తారు?
జవాబు: పెగనను ప్రధానంగా డ్రెయినేజీ సమస్య వేధిస్తోంది. గెలిచిన వెంటనే పట్టణానికి అవుట్‌లెట్ డ్రెయిన్ తీసుకురావడానికి కృషి చేస్తా. దీనికి అనుసంధానంగా పట్టణంలో డ్రెయిన్లు ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఏడో వార్డులో అసంపూర్తిగా ఉన్న డ్రెయి నిర్మాణం పూర్తి చేస్తాం. ప్రస్తుతం రోజు విడిచి రోజు తాగునీరు వస్తోంది. అవకాశం ఉంటే ప్రతి రోజూ నీరందించేలా చర్యలు తీసుకుంటాం. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. మా పాలకవర్గ హయాంలో ఎప్పటికప్పుడు వ్యర్థాలను పారిశుద్ధ్య సిబ్బంది తొలగించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. ఈ సమస్యను పరిష్కరిస్తాం.
అభివృద్ధి పథం
ప్రశ్న: మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?
ప్రశ్న: మునిసిపల్ చైర్‌పర్సన్‌గా మీరు చేసిన సేవలు ఏమిటి?
ప్రశ్న: పురప్రజలను మీరు కోరేది ఏమిటి?
పెడన పురప్రజలకు సేవ చేయాలన్న
లక్ష్యంతో ఎన్నికల్లో పోటీ
పట్టణంలో రోజూ తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటా
డ్రెయినేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటా
వైఎస్సార్ సీపీ మున్సిపల్
చైర్‌పర్సన్ అభ్యర్థి కటకం నాగకుమారి