రేపటి నుంచి కరాటే చాంపియన్‌షిప్‌ | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి కరాటే చాంపియన్‌షిప్‌

Oct 23 2026 2:15 AM | Updated on Oct 23 2026 2:15 AM

రేపటి నుంచి కరాటే చాంపియన్‌షిప్‌ యువకుడిని కొట్టి చంపిన కేసులో నలుగురికి రిమాండ్‌ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం తాళం వేసి ఉన్న ఇంట్లో బంగారం చోరీ టీడీపీ రెబల్‌ అభ్యర్థి ప్రచారం

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్పోర్ట్స్‌ కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో వైజాగ్‌లోని గాజువాక రాజీవ్‌ ఇండోర్‌ స్టేడియంలో 5వ సౌత్‌ ఇండియా జోనల్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌–2026 పోటీలు ఈ నెల 24, 25 తేదీల్లో జరుగనున్నాయని ది వరల్డ్‌ షోటాకాన్‌ కరాటే ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి జె.విజయ్‌కుమార్‌ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ఎన్టీఆర్‌ జిల్లా నుంచి కరాటే విద్యార్థులు ఎం.సుకీర్త్‌, బి.సహాస్యలహారి, వి.నాగ చైతన్య, డి.జ్ఞానప్రకాష్‌ కటా, కుమిటె విభాగాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు.

విజయవాడలీగల్‌: విజయవాడ పటమట డొంకరోడ్డులోని ఓ పాన్‌ షాపు ఫ్రిడ్జ్‌ నుంచి రూ.20 విలువైన వాటర్‌ బాటిల్‌ కాజేయడానికి ప్రయత్నించాడన్న కారణంతో నల్గొండ జిల్లాకు చెందిన మాస సాయికుమార్‌ (33) అనే వ్యక్తిపై నలుగురు వ్యక్తులు కర్కశంగా దాడి చేసి ప్రాణాలు తీశారు. అతను వాటర్‌ బాటిల్‌ తీస్తుండగా గమనించిన షాపు సిబ్బంది రవిశంకర్‌, శంకర్‌లతో పాటు మరో ఇద్దరు యువకులు పోతురెడ్డి నవీన్‌, సాయిప్రణీత్‌ కలసి సాయికుమార్‌ను విద్యుత్‌ స్తంభానికి కట్టేసి సుమారు రెండు గంటల పాటు కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో అతడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గురువారం విచారణ అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించి 8వ అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి వచ్చే నెల 4వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. అనంతరం వారిని విజయవాడ జిల్లాజైలుకు తరలించారు.

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): కొత్తపేట కేబీఎన్‌ కాలేజీ సమీపంలోని షేక్‌ రాజా హాస్పిటల్‌ వద్ద గుర్తు తెలియని 60 ఏళ్ల వృద్ధుడి మృతదేహన్ని గుర్తించినట్లు కొత్తపేట సీఐ కొండలరావు పేర్కొన్నారు. హాస్పిటల్‌ రెండో గేటు వద్ద ఓ వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉన్నాడనే సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికంగా అతని గురించి ఆరా తీశారు. అయితే సదరు వ్యక్తికి సంబంధించిన వారి గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మృత దేహాన్ని కొత్త గవర్నమెంట్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించామన్నారు. సదరు వ్యక్తికి సంబంధించి వారు ఎవరైనా కొత్తపేట పోలీసులను సంప్రదించాలని కోరారు.

లంకపల్లి(ఘంటసాల): తాళం వేసి ఉన్న ఇంట్లో బంగారం చోరీ చేసిన ఘటన మండలంలోని లంకపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంకపల్లి గ్రామానికి చెందిన వీరమాచినేని నరేంద్ర కాలు ఆపరేషన్‌ చేయించుకోవడానికి ఈ నెల 15న విజయవాడ వెళ్లారు. ఈ నెల 21న బుధవారం సాయంత్రం తమ బంధువైన రాజాకి ఫోన్‌చేసి ఇంటి వద్ద ఉన్న ట్రాక్టర్‌ను స్టార్ట్‌ చేయాలని కోరాడు. దీంతో ఇంటికి వెళ్లిన రాజా ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటం చూసి నరేంద్రకు ఫోన్‌ చేశారు. ఇంట్లోకి వెళ్లి చూడమని చెప్పడంతో రాజా ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తలుపులు పగలగొట్టి ఉండటం, వస్తువులను చిందరవందరగా పడి ఉండటం చూసి దొంగతనం జరిగినట్లుగా ఉందని చెప్పారు. దీంతో నరేంద్ర గురువారం ఇంటికి వచ్చి చూసుకొని బీరువాల్లో ఉన్న సుమారు 40 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘంటసాల ఎస్‌ఐ వేమన చందన సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించడంతో పాటు చల్లపల్లి సీఐ కె.ఈశ్వరరావుకు సమాచారం ఇచ్చారు. దీంతో చల్లపల్లి సీఐ ఈశ్వరరావు నరేంద్ర కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వగా వారు వచ్చిన ఆధారాలను సేకరించారు. నరేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చందన తెలిపారు.

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): విజయవాడ నగరంలోని 69వ డివిజన్‌ శ్రీనగర్‌ కాలనీలో టీడీపీ సీటు రాకపోవటంతో ఆ పార్టీ నాయకుడు బాబీ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగారు. గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బ్యాట్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. బాబీ అనుచరులతో పాటు టీడీపీ, జనసేనకు చెందిన పలువురు ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement