ఎన్నికల సామగ్రి పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల సామగ్రి పరిశీలన

Oct 22 2026 4:02 AM | Updated on Oct 22 2026 4:02 AM

పెడన: జిల్లా విద్యాశాఖాధికారి, ఎన్నికల మెటీరియల్‌ వెరిఫికేషన్‌ నోడల్‌ అధికారి యూవీ సుబ్బారావు మంగళవారం పెడన పురపాలక సంఘ కార్యాలయంలో ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు, పోలింగ్‌ సమయంలో ఎన్నికల అధికారులు పూర్తి చేయాల్సిన ఫారాలు తదితర వాటిపై ఆరా తీయడమే కాకుండా అన్ని ఉన్నాయో?లేదో? అని వాకబు చేసి స్వయంగా పరిశీలించారు. ఈయనకు మునిసిపల్‌ మేనేజర్‌ కేడీఎన్‌ సుందరం, ఇతర సిబ్బంది పూర్తి సమాచారం ఇవ్వడమే కాకుండా ఆయా పత్రాలను అందజేశారు. యూవీ సుబ్బారావు మాట్లాడుతూ మచిలీపట్నం కార్పొరేషన్‌తోపాటు పెడన, ఉయ్యూరు పురపాలక సంఘాలలో పర్యటించి ఎన్నికల సామగ్రిని పరిశీలించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement