వైభవంగా ఇంద్ర‘గిరి’ ప్రదక్షిణ | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ఇంద్ర‘గిరి’ ప్రదక్షిణ

Nov 25 2026 9:30 AM | Updated on Nov 25 2026 9:30 AM

వైభవంగా ఇంద్ర‘గిరి’ ప్రదక్షిణ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు సపరివారంగా కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ మహోత్సవం మంగళవారం వైభవంగా సాగింది. దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన ప్రదక్షిణ సుమారు 8 కిలోమీటర్ల మేర సాగింది. తొలుత తెల్లవారుజామున 5.55 గంటలకు ఘాట్‌రోడ్డు వద్ద దేవస్థాన ప్రచార వాహనం, ప్రత్యేకంగా అలంకరించిన పూల రథంపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో శీనానాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణ ప్రచార రథానికి కొబ్బరి కాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, చిన్నారుల కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలతో ఊరేగింపు ముందుకు సాగింది. అమ్మవారు వచ్చే మార్గంలో భక్తులు పసుపు నీళ్లతో శుభ్రం చేసి హారతులిచ్చి స్వాగతం పలికారు. ఆలయ ట్రస్ట్‌బోర్డు సభ్యులు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. కాగా గిరిప్రదక్షిణ సమాచారం ఆలస్యంగా చైర్మన్‌ రాధాకృష్ణకు తెలియజేయడంతో ఆయన అధికారులు, అర్చకులపై రోడ్డుపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు చిన్నబుచ్చుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement