ఇంకెన్నాళ్లీ సాగునీటి వెతలు? | - | Sakshi
Sakshi News home page

ఇంకెన్నాళ్లీ సాగునీటి వెతలు?

Nov 25 2026 9:30 AM | Updated on Nov 25 2026 9:30 AM

పులిగడ్డ ఇరిగేషన్‌ బంగ్లా వద్ద రైతుల ఆందోళన

మర్రిపాలెం(నాగాయలంక): ప్రధాన పంట కాలువలు, ఉపకాలువల ద్వారా నాగాయలంక మండలంలోని పొలాలకు సాగునీటిని సక్రమంగా అందించాలని కోరుతూ మర్రిపాలెంలోని నాగాయలంక నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట మంగళవారం సాయంత్రం రైతులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షుడు బీసాబత్తుని ప్రసాద్‌ నేతృత్వంలో రైతులు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే సంబంధిత ఇరిగేషన్‌ ఏఈ రవితేజ అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌ చేస్తే పులిగడ్డ ఇరిగేషన్‌ బంగ్లాలో ఉన్నానని చెప్పడంతో రైతులు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి మండలంలో రైతాంగానికి సాగునీరు తక్షణం అందించి ఆదుకోవాలని నినాదాలు చేశారు.

నిర్లక్ష్య ధోరణి సరికాదు..

ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ పంట కాలువల్లో సాగునీరు అందుబాటులో లేకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, అధికారులను అడుగుతుంటే సాగునీరు రేపు వస్తాయ్‌, ఎల్లుండి వస్తాయ్‌ అంటూ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పారు. పంటకు ప్రధానంగా అవసరమైన సమయంలో నీరు అందకపోవడంతో రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడి త్వరితగతిన సక్రమంగా సాగు నీటిని అందించాలని ఈ సందర్భంగా రైతులు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement