వివాహిత ఆత్మహత్య కేసులో భర్త, ఆడపడుచు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య కేసులో భర్త, ఆడపడుచు అరెస్టు

Oct 10 2026 1:58 AM | Updated on Oct 10 2026 1:58 AM

వివాహిత ఆత్మహత్య కేసులో భర్త, ఆడపడుచు అరెస్టు

తోట్లవల్లూరు: వివాహితను గృహహింసకు గురి చేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో భర్త, ఆడపడుచును అరెస్టు చేసినట్లు పమిడిముక్కల సీఐ వై.చిట్టిబాబు తెలిపారు. తోట్లవల్లూరు గ్రామానికి చెందిన పోతుబోయిన సత్యన్నారాయణ కుమార్తె లక్ష్మీప్రియాంక(27) అత్తింటి వేధింపులు తాళలేక ఇటీవల పుట్టింట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన మృతికి భర్త, అత్తింటి వారే కారకులని సూసైడ్‌ నోట్‌ రాసింది. కేసు దర్యాప్తులో భాగంగా లక్ష్మీప్రియాంక ఆత్మహత్యకు కారకులైన భర్త వేలూరి అశోక్‌కుమార్‌, ఆడపడుచు కలిదిండి అపర్ణను మండలంలోని యాకమూరు వద్ద శుక్రవారం అరెస్టు చేసి ఉయ్యూరు కోర్టుకి తరలించినట్లు, న్యాయాధికారి నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విదించినట్లు సీఐ చిట్టిబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement