చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి ఎౖక్సైజ్ అధికా రులు గురువారం లాటరీ నిర్వహించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది మద్యం షాపుల రెన్యువల్‌కు అనుమతిచ్చింది. జిల్లాలో 35 షాపులను రెన్యు వల్ చేయలేదు. ఈ షాపులను లాటరీలో కొత్తవారికి కేటాయించేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. 21 షాపులకు మాత్రం 110 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ 21 షాపులకు కలెక్టరేట్లోని వీడియోకాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ గురువారం లాటరీ ప్రక్రియను నిర్వహించారు. షాపులను దక్కించుకున్న దరఖాస్తుదారులు 25 శాతం లైసెన్సు ఫీజు చెల్లించిన అనంతరం ప్రొవిజినల్ లైసెన్సును జారీ చేస్తామని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ లావణ్య, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ నిఖిల, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ భార్గవ్, ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు.


