న్యూస్‌రీల్
వేరే పనిచూసుకోమంటున్నారు..
ఇక్కడే ఇలా ఎందుకో అర్థం కావడం లేదు
క్రమంగా నిర్వీర్యమైన క్లాప్ వ్యవస్థ..
పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సమీపంలోని మెటీరియల్ రికవరీ ఫెసిలిటీలకు (ఎంఎస్‌ఎఫ్) తరలించేలా వాహనాలను ఏర్పాటు చేసింది. వార్డు సచివాలయ పరిధిలోని ఇళ్ల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో వాహనం రోజుకు రెండు, మూడు ట్రిప్పులు తిరిగేలా ప్రణాళిక రూపొందించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్లాప్ వ్యవస్థపై నిర్లక్ష్యం పెరగడంతో వాహనాలు ఒక్కొక్కటిగా నిలిచిపోయి, మొత్తం వ్యవస్థే నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.
కృష్ణా ఏఆర్ ఏఎస్పీగా..
మువ్వల సవ్వడితో..
పులిచింతల సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 29.0797 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.
సర్కారు నిర్లక్ష్యంతో నిలిచిన చెత్త వాహనాలు
నేడు మద్యం షాపులకు లాటరీ
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయంలో ‘2వ బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయు డు ఎండోమెంట్ ఉపన్యాస కార్యక్రమం’ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఆచార్య కె. రాంజీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ పూర్వ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వెంకయ్య హయాంలో (2013–14) బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు కుటుంబసభ్యులు అందించిన రూ. 3లక్షల విరాళంతో ఈ ఎండోమెంట్ లెక్చర్ ప్రారంభమైందని గుర్తుచేశారు. ఈనాటి కార్యక్రమానికి న్యూఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి డాక్టర్ కె. శ్రీనివాస్ ప్రధాన వక్తగా హాజరై ప్రసంగిస్తూ ఎన్‌ఐఈపీఏ సంస్థ దేశవ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల నుంచి దిగువ స్థాయి ఉద్యోగుల వరకు అధ్యాపక అభివృద్ధి కార్యక్రమాలు, పరిశోధన కార్యక్రమాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓటర్లు అందుబాటులో లేకపోవడం, వేరే ప్రాంతానికి తరలిపోవడం, మరణించిన వారు, ఒకటి కంటే ఎక్కువసార్లు నమోదైన వారి జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన చేపట్టనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ‘సర్’ ప్రక్రియలో భాగంగా అధికారులు జూన్ 15 నుంచి జూలై 24వరకు ఇంటింటి సందర్శన చేశారన్నారు. ఈ ప్రక్రియలో జిల్లాలో మొత్తం 1,23,714 మంది ఏఎస్‌డీడీ ఓటర్లు జాబితాలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో జిల్లాలో 15,89,731 మంది ఉన్నారన్నారు. తదుపరి నోటీసుల ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 6 వరకు మరో 12,786 మంది అనర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ 16న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కాగా అక్టోబర్ 8 నుంచి బూత్ స్థాయి అధికారులు ఏఎస్‌డీడీ జాబితాలోని తొలగించిన పేర్లకు సంబంధించి మరోసారి ఇంటింటి సందర్శన చేపడతారని తెలిపారు.
చెత్త సేకరణకు బ్రేక్..
42 వాహనాలతో ప్రారంభమై..
ప్రత్యేక అధికారికి తెలియకుండా..?
స్వచ్ఛ బందరు ఎలా సాధ్యం?
కమిషనర్ నిర్ణయాల ప్రభావం..
కోనేరుసెంటర్: జిల్లాలోని మద్యం దుకాణాలకు సంబంధించి గురువారం లాటరీ నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ డి. భార్గవ్ తెలిపారు. 35 షాపులకు సంబంధించి బుధవారం నాటికి 21 షాపులకు దరఖాస్తులు అందినట్లు చెప్పారు. మిగిలిన దుకాణాలకు నాలుగు చొప్పున దరఖాస్తులు అందినట్లయితే లాటరీ నిర్వహిస్తామన్నారు. బుధవారం నాటికి ఒక్కో షాపునకు సంబంధించి నాలుగు దరఖాస్తులు అందిన వాటికి గురువారం ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశపు హాలులో కలెక్టర్ సమక్షంలో లాటరీ తీస్తామన్నారు. లాటరీలో షాపులు దక్కించుకున్న వ్యాపారులు షాపు నాలుగో వంతు రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే పర్మిట్ రూమ్‌కు సంబంధించి వన్ థర్డ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమతో పాటు ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌తో పాటు ఇతర సంబంధిత పత్రాలు తీసుకురావాలన్నారు. ఇతర వివరాలకు మీ పరిధుల్లోని ఎకై ్సజ్ సీఐలు, మచిలీపట్నం ఎక్సైజ్ కార్యాలయంతో పాటు 8466981837ను సంప్రదించవచ్చని చెప్పారు.
కోనేరుసెంటర్: కృష్ణాజిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీగా బి. చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఏలూరు జిల్లాలో డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన
ఉద్యోగోన్నతిపై జిల్లాకు
ఏఎస్పీగా రానున్నారు.
ఈ మేరకు రాష్ట్ర డీజీపీ
బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
యునెస్కో గుర్తింపు కోసం కూచిపూడిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి వర్క్‌షాపులో భాగంగా రెండో రోజు బుధవారం కూచిపూడి సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు.


