ముగిసిన నామినేషన్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ముగిసిన నామినేషన్ల పరిశీలన

Oct 25 2026 9:26 AM | Updated on Oct 25 2026 9:26 AM

చిలకలపూడి(మచిలీపట్నం): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శనివారంతో ముగిసింది. రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ పర్యవేక్షణలో ఉదయం ఎనిమిది గంటల నుంచి నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ప్రారంభించారు. మొవ్వ మండల టీడీపీ అభ్యర్థి నన్నపనేని స్వర్ణలత మూడు సెట్లు నామినేషన్‌ దాఖలు చేయగా వాటిలో రెండు సెట్లు సరిగా లేనందున అధికారులు ఆమోదించలేదు. ఒక సెట్‌ నామినేషన్‌ను ఆమోదించారు. నాగాయలంక మండలం బీజేపీ అభ్యర్థి భోగాది రమాదేవి మూడు సెట్ల నామినేషన్‌ దాఖలు చేయగా వాటిలో ఒక సెట్‌ నామినేషన్‌ను ఆమోదించలేదు. మిగిలిన రెండు సెట్ల నామినేషన్‌ను ఆమోదించారు. 26 జెడ్పీటీసీ స్థానాలకు 197 నామినేషన్లు రాగా ఇందులో మూడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 194 నామినేషన్లను అధికారులు ఆమోదించారు. మొత్తం 152 మంది అభ్యర్థులు సమర్పించిన 194 నామినేషన్లు సరైనవిగా ధ్రువీకరించారు.

నేటి నుంచి ఉపసంహరణ

నామినేషన్ల పరిశీలన ముగిసిన నాటి నుంచి అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరించుకోవచ్చని జెడ్పీ సీఈఓ ఎం.శ్రీహరి శనివారం తెలిపారు. ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని సూచించారు. పరిశీలన కార్యక్రమంలో జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆర్‌.సి.ఆనంద్‌కుమార్‌, డ్వామా పీడీ ఎం.వి.శివప్రసాద్‌ యాదవ్‌, జిల్లా రిజిస్ట్రార్‌ మూర్తి, డీసీఓ చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ

గన్నవరం మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, తహసీల్దారు కె. వెంకటశివయ్య నేతృత్వంలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించారు. మొత్తం 119 నామినేషన్లకు ఒకటి తిరస్కరణకు గురైంది ముస్తాబాద–1 టీడీపీ అభ్యర్థి మేడేపల్లి శ్రీదేవి డీఆర్‌డీఏ–వెలుగు శాఖలో బుక్‌కీపర్‌గా పనిచేస్తూ ప్రభుత్వం నుంచి జీతభత్యాలు పొందుతున్న కారణంగా ఆమె నామినేషన్‌ను తిరస్కరించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement